ఆరుగురు యువకులు పెదవాగులో మునిగి చనిపోవడం విచారకరం.. పరిహారమివ్వాలి: లోకేశ్
- పోలవరం నియోజకవర్గానికి చెందిన యువకుల మృతి
- మృతుల కుటుంబాలకు నా సానుభూతి
- ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను పోగొట్టుకున్నారు
- ప్రభుత్వం వారిని ఆదుకోవాలి
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం, భూదేవిపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్ ప్రాంతానికి వనభోజనాలకు వెళ్లి, సరదాగా స్నానానికి పెదవాగులో దిగి మునిగిపోయారు. వారంతా నీటి మడుగులోకి జారిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ... ‘పోలవరం నియోజకవర్గం, భూదేవిపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు పెదవాగులో మునిగి చనిపోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను పోగొట్టుకుని తీరని దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను, ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారమిచ్చి ఆదుకోవాలి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారి ఫొటోలను ఆయన పోస్టు చేశారు.