పవన్ కల్యాణ్ సినిమాలో మరో బిజీ స్టార్?
- 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్
- సినిమాలో కీలకమైన మరో హీరో స్థాయి పాత్ర
- నిన్నటివరకు ప్రచారంలో రానా, నితిన్ పేర్లు
- తాజాగా తెరపైకి వచ్చిన కిచ్చ సుదీప్ పేరు
చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న పవన్ కల్యాణ్ ఆ తరువాత వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
వీటిలో ఒకటి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్. మలయాళంలో వచ్చిన ఈ హిట్ సినిమాలో పవన్ కాకుండా కీలకమైన మరో హీరో పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్రలో నటిస్తారంటూ మొదటి నుంచీ రానా దగ్గుబాటి పేరు వినిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా పవన్ అభిమాని యంగ్ హీరో నితిన్ పేరు వార్తల్లోకి వచ్చింది.
ఈ క్రమంలో ఇప్పుడు, తాజాగా కన్నడ బిజీ స్టార్ కిచ్చ సుదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకు సుదీప్ బాగా సూటవుతాడని భావించిన దర్శక నిర్మాతలు ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంతుందన్నది త్వరలో తెలుస్తుంది.
ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. అలాగే దీనికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తాడని అంటున్నారు. మరో విషయం ఏమిటంటే, ఇందులో పవన్ సరసన కథానాయిక పాత్రకి సాయిపల్లవిని అడుగుతున్నారట. మొత్తానికి ఈ సినిమా చాలా విశేషాలని సంతరించుకుంటోంది.