భారీ భూకంపం ధాటికి టర్కీ, గ్రీస్‌లో కుప్పకూలిపోయిన భారీ భవనాలు.. వీడియోలు ఇవిగో
- టర్కీ, గ్రీస్ దేశాలను వణికించిన భూకంపం
- పేక మేడల్లా కుప్పకూలిపోయిన భవనాలు
- 25కి చేరిన మృతుల సంఖ్య
టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతంలో భారీ అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో కొన్ని భవనాలు భూకంపం ధాటికి కదిలాయి. అందులోని ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దాదాపు 25 మంది మృతి చెందారని, వేలాది మందికి గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
కాగా, ఐజ్‌మిర్ నగరంలోని ఓ రెస్టారెంటు భూకంపం ధాటికి సుమారు నిమిషం పాటు ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. టర్కీ, గ్రీస్ వాసులు తమకు ఎదురైన భయానక అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.