జేమ్స్ బాండ్ కథానాయకుడు షాన్ కానరీ కన్నుమూత
- జేమ్స్ బాండ్ చిత్రాలలో వరల్డ్ ఫేమస్ అయిన కానరీ
- కానరీ వయసు 90 ఏళ్లు
- తమ హీరో మృతిని నిర్ధారించిన జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ
జేమ్స్ బాండ్ చిత్రాల్లో కథానాయకుడిగా ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పొందిన ప్రముఖ నటుడు షాన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. షాన్ కానరీ మృతికి కారణాలు తెలియరాలేదు. అయితే ఆయన మరణాన్ని జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్ధారించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. తెరపై జేమ్స్ బాండ్ గా కనిపించిన మొట్టమొదటి హీరో షాన్ కానరీయేనని తెలిపింది.
1962లో వచ్చిన 'డాక్టర్ నో' చిత్రం మొట్టమొదటి బాండ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. స్కాట్లాండ్ కు చెందిన కానరీ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కుటుంబ పోషణ కోసం శవపేటికలకు మెరుగులు దిద్దే పనివాడిగా, పాల కుర్రాడిగానూ పనిచేశాడు. అయితే బాడీ బిల్డింగ్ హాబీ ఆయనను హీరోగా మార్చింది. బాండ్ చిత్రాలతో ఆయన పేరు ప్రపంచమంతా మార్మోగింది.
డాక్టర్ నో, ఫ్రం రష్యా విత్ లవ్, గోల్డ్ ఫింగర్, థండర్ బాల్, యు ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్ చిత్రాల్లో బ్రిటీష్ గూఢచారి జేమ్స్ బాండ్ గా ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనకు 1988లో ది అన్ టచబుల్స్ చిత్రానికి గాను ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డు లభించింది.
కాగా, షాన్ కానరీ మృతి పట్ల హాలీవుడ్ హీరో హ్యూ జాక్ మన్, బాలీవుడ్ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ విచారం వ్యక్తం చేశారు. తమ అభిమాన హీరో మృతికి సంతాపం తెలియజేశారు.