ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • 355 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 95 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడి 40,616కి పెరిగింది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,909 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.85%), సన్ ఫార్మా (3.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.46%), ఇన్ఫోసిస్ (3.02%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.30%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.64%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.58%), ఎన్టీపీసీ (-0.93%),  ఎల్ అండ్ టీ (-0.89%).


More Telugu News