అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మళ్లీ విజయం సాధించిన ‘ఆ నలుగురు’

  • నల్లజాతీయులు, మైనారిటీ హక్కుల కోసం పోరాడుతున్న నలుగురు మహిళలు
  • ‘ద స్క్వాడ్’గా ప్రపంచవ్యాప్త గుర్తింపు
  • సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం దాదాపు ఖాయమైంది. ఈ ఎన్నికల్లో నల్లజాతి స్వలింగ సంపర్కుడు రిచీ టోరెస్ (32) ఇప్పటికే విజయం సాధించి రికార్డులకెక్కగా, దేశంలో నల్లజాతీయులు, మైనారిటీ హక్కుల కోసం గళమెత్తిన నలుగురు మహిళా పార్లమెంటు సభ్యులు మరోమారు విజయం సాధించారు. ఒమర్, అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, రషీదా తలెయిబ్, అయన్నా ప్రిస్లీలు ‘ ద స్క్వాడ్’ పేరిట ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

 మైనారిటీ హక్కుల కోసం స్క్వాడ్ పేరుతో పోరాడుతున్న వీరు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన వీరు అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో మిన్నెసొటా నుంచి ఇల్హానా, న్యూయార్క్‌ నుంచి అలెగ్జాండ్రియా, మిషిగాన్‌ నుంచి రషీదా తలెయిబ్, మసాచుసెట్స్‌ నుంచి అయన్నా మరోమారు ఎన్నికయ్యారు.


More Telugu News