కేసీఆర్ అవినీతిని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు?: మాణికం ఠాగూర్

  • బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారు
  • కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోంది
  • కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ విమర్శించారు. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది.

ఈ సందర్భంగా మాణికం మాట్లాడుతూ, వ్యవసాయానికి రైతులను దూరం చేసేలా వ్యవసాయ చట్టాలు ఉన్నాయని చెప్పారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్లు మూతపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణను చేపట్టి రాష్ట్రపతి, గవర్నర్ లకు పంపుతామని చెప్పారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాణికం మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. వీరి అవినీతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.


More Telugu News