'ఆహా' కోసం సమంత స్పెషల్ షో.. 'సామ్ జామ్'!

  • అల్లు అరవింద్ ఆధ్వర్యంలో 'ఆహా' ఓటీటీ 
  • ఈ నెల 13 నుంచి 'సామ్ జామ్' స్ట్రీమింగ్
  • హోస్టింగ్ జాబ్ ఈజీ కాదన్న సమంత
  • ఈ షో కొత్త అనుభవమన్న ముద్దుగుమ్మ  
అక్కినేని వారి కోడలు, అందాల కథానాయిక సమంత ఇప్పుడు ఫుల్ టైమ్ హోస్టుగా మారింది. ఇటీవల 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్లకు హోస్టుగా వ్యవహరించిన సమంత ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ అవతారం ఎత్తుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని 'ఆహా' పలు వినోదాత్మక కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సమంత హోస్టుగా 'సామ్ జామ్' అనే షోను రూపొందిస్తోంది.

ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 13 నుంచి ఈ షోను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కథానాయిక సమంత మాట్లాడుతూ, ఈ షో చేయడం అన్నది తనకు ఒక కొత్త అనుభవమని చెప్పింది. అయితే, ఇది అనుకున్నంత ఈజీ జాబ్ కాదని కూడా పేర్కొంది.

"హోస్టింగ్ చేయడం అనేది ఈజీ ఎంత మాత్రం కాదు. నిజం చెప్పాలంటే, దీంతో పోల్చితే, సినిమాలో నటించడమే ఈజీనేమో అనిపించింది. సామ్ జామ్ షో చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. ఈమధ్య బిగ్ బాస్ కి హోస్ట్ చేశాను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అయితే, సామ్ జామ్ కేవలం టాక్ షో మాత్రం కాదు. ఇందులో గెస్ట్ తో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. దీని ద్వారా టాలెంటును కూడా ఎంకరేజ్ చేస్తాం. మొత్తానికి ఇదొక కొత్త అనుభవం.. అనుభూతి కూడా' అని చెప్పింది సమంత.


More Telugu News