వరదసాయం రూ.10 వేలు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఇళ్లకే వెళుతున్నాయి: రాజాసింగ్
- వరద నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు
- సాయం అందించడంలో సర్కారు విఫలమైందని వెల్లడి
- టీఆర్ఎస్ కు ఎవరూ ఓటేయొద్దని పిలుపు
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ అధికార టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. వరద సాయం రూ.10 వేలు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఇళ్లకే చేరుతున్నాయని ఆరోపించారు. వరద బాధితులందరికీ ఆర్థికసాయం అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇప్పటికీ అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయని, కూలిపోయిన ఇళ్లను తొలగించడంలోనూ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎవరూ ఓటేయొద్దని స్పష్టం చేశారు.
వరద కారణంగా ఇల్లు కూలిపోతే రూ.1 లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేలు, నీరు ప్రవేశిస్తే రూ.10 వేలు అని గొప్పగా ప్రకటించిన సీఎం కేసీఆర్... ఏ జీవో ప్రకారం చెల్లింపులు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.