పీట్ సాంప్రాస్ ను సమం చేసి, మరో రికార్డును సాధించిన జకోవిచ్!

  • అత్యధిక సీజన్ లను టాప్ ర్యాంక్ తో ముగించిన జకో
  • ఫెదరర్, నాదర్ రికార్డును దాటిన సెర్బియా స్టార్
  • తన కల నిజమైందని వ్యాఖ్య
తన అభిమాన క్రీడాకారుడు పీట్ సాంప్రాస్ రికార్డును నొవాక్ జకోవిచ్ సమం చేశాడు. పురుషుల టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక సీజన్ లను నంబర్ వన్ ర్యాంక్ తో ముగించిన సాంప్రాస్ సరసన జకో చేరిపోయారు. 1993 వరకూ 1998 వరకూ సాంప్రాస్ అన్ని సీజన్ లనూ టాప్ లో ఉంటూ ముగించగా, జకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్ లను టాప్ ర్యాంక్ తో ముగించాడు.

ఈ క్రమంలో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ల రికార్డును జకోవిచ్ దాటాడు. వీరిద్దరూ ఐదు సంవత్సరాల పాటు సీజన్ ను వరల్డ్ వన్ ర్యాంకులో ముగించారు. ఫెదరర్, నాదల్ లు చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన సంగతి తెలిసిందే.

ఇక గత సీజన్ లో మొత్తం 42 టెన్నిస్ మ్యాచ్ లు ఆడిన జకోవిచ్ 39 మ్యాచ్ ల్లో విజయం సాధించి, కేవలం మూడింట మాత్రమే ఓడిపోయాడు. తాజా రికార్డుపై స్పందించిన జకో, చిన్నప్పుడు తాను సాంప్రాస్ ను ఎంతో ఆరాధించేవాడినని, ఇప్పుడు తన అభిమాన ఆటగాడి రికార్డును సమం చేయడంతో తన కల నిజమైందని అన్నాడు.



More Telugu News