చిన్నారి సెల్యూట్ కు ఫిదా... సత్కరించిన ఐటీబీపీ!

  • అక్టోబర్ లో తీసిన వీడియో వైరల్
  • చిన్నారి కోసం ప్రత్యేక ఐటీబీపీ యూనిఫామ్
  • డ్రిల్ క్యాంప్ లో పాల్గొనే అవకాశం
ఎల్కేజీ చదువుతున్న ఐదు సంవత్సరాల చిన్నారి నవాంగ్ నంగ్యాల్, చేసిన ఆర్మీసెల్యూట్ వైరల్ కాగా, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) ఆ చిన్నారిని సత్కరించింది. లడఖ్ ప్రాంతానికి చెందిన నవాంగ్, ఛుల్సుల్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వాడు.

అక్టోబర్ లో ఆ చిన్నారి జవాన్లకు సెల్యూట్ చేస్తుండగా తీసిన వీడియో బయటకు రాగా, అది వైరల్ అయింది. దీంతో ఐటీబీపీ నవాంగ్ ను సత్కరించాలని భావించింది. అతని సైజ్ కు సరిపడా ఐటీబీపీ యూనిఫామ్ ను కుట్టించింది. ఆపై డ్రిల్ క్యాంప్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఈ చిన్నారి మరింత మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ప్రత్యేక డ్రస్ లో సెల్యూట్ చేస్తున్న మరో వీడియోను పోస్ట్ చేసింది.


More Telugu News