ఇది చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయి: పూరీ జగన్నాథ్
- కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు బంద్
- ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న షూటింగులు
- మళ్లీ ఆ రోజులు రావాలంటూ పూరీ ట్వీట్
- సినిమా థియేటర్ మన అమ్మ అంటూ వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి దెబ్బకు తెలుగు సినీ రంగం స్తంభించిపోవడంతో, ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి, స్టూడియోలు మూతపడ్డాయి. థియేటర్లలో బొమ్మ పడలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో కదలిక కనిపిస్తోంది. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోయినా షూటింగ్ లు షురూ అయ్యాయి. త్వరలోనే సినిమా హాళ్లు కూడా తెరుచుకుంటాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఓ వీడియో చూసి తాను ఎంతో భావోద్వేగాలకు లోనయ్యానని దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో తెలిపారు. తాళం వేసి ఉన్న ఓ థియేటర్ ను మళ్లీ తెరుస్తున్న సీన్లు ఆ వీడియోలో చూడొచ్చు. ఓ సినిమాలో కనిపించిన ఈ సన్నివేశాన్ని పూరీ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు. "మళ్లీ ఆ రోజులు రావాలి, విజిల్స్ వేయాలి, పేపర్లు ఎగరాలి, చొక్కాలు చిరగాలి అని ఆకాంక్షించారు. సినిమా థియేటర్ మన అమ్మ" అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు.