ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన జడ్జి రామకృష్ణ
- తనను జడ్జి కాదన్నారని మంత్రిపై ఆరోపణలు
- తన పరువుకు భంగం కలిగించారని వ్యాఖ్య
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్
చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ, వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్జి రామకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు.
తనను జడ్జి కాదంటూ మంత్రి వ్యాఖ్యానించారంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టం ముందు దోషిలా నిలబడాలని అన్నారు. ఈ మేరకు ఆయన మంత్రికి లీగల్ నోటీసులు పంపారు. వైసీపీ సర్కారుపై బురద చల్లే ఉద్దేశం తనకులేదని ఆయన స్పష్టం చేశారు.