రామాయణం వింటూ పెరిగాను.. భారత్ అతి పెద్ద దేశం: తన కొత్త పుస్తకంలో పేర్కొన్న ఒబామా

  • ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసిన ఒబామా
  • ఇండోనేషియాలో త‌న బాల్యం గ‌డిచింద‌ని వివరణ
  • ప్రపంచంలోని  ఆరోవంతు జ‌నాభా భారత్‌లో ఉందని వ్యాఖ్య
  • ఏడు వంద‌ల‌కుపైగా భాష‌లు మాట్లాడతారన్న ఒబామా
‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరిట ఓ పుస్త‌కం రాసిన అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా అందులో భారత్, హిందూ సంప్రదాయాలు వంటి ఎన్నో విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. తన బాల్యం గురించి ఆయన ఈ పుస్తకంలో చెప్పారు. ఇండోనేషియాలో త‌న బాల్యం గ‌డిచింద‌ని తెలిపారు. అప్పట్లో తాను రామా‌య‌ణం, మ‌హాభారతం క‌థ‌ల‌ను విన్న‌ట్లు చెప్పారు.

భార‌త్ అతిపెద్ద దేశ‌మ‌ని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని  ఆరోవంతు జ‌నాభా అక్క‌డే ఉం‌ద‌ని తెలిపారు. భారత్‌లో సుమారు రెండు వేల స్థానిక తెగలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. భారత్‌లో దాదాపు ఏడు వంద‌ల‌కుపైగా భాష‌లు మాట్లాడతారని చెప్పారు. 2010లో అమెరికా అధ్యక్షుడి హోదాలో, తొలిసారి ఒబామా భార‌త్‌లో పర్యటించారు. అయితే, చిన్ననాటి నుంచి ఊహాల్లో మాత్రం భారత్‌కు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించిన‌ట్లు తెలిపారు. తూర్పు దేశాల మ‌తాల‌పై ఆస‌క్తి వ‌ల్ల అలా జ‌రిగి ఉంటుంద‌ని వివరించారు. భారత్, పాకిస్థాన్‌లోని తన మిత్రులు త‌న‌కు ప‌ప్పు, కీమా వండ‌డం నేర్పించార‌ని తెలిపారు. అలాగే, తనకు బాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు కూడా చేశారని చెప్పారు.


More Telugu News