హైదరాబాద్‌లో పచ్చదనాన్ని పెంచాం.. మాకే ఓటు వేయండి: కేటీఆర్
- హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం
- హరితహారం ద్వారా నగరంలో పచ్చదనం
- హైదరాబాద్‌లో 934 కాలనీ పార్కులు
- 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తాజాగా మరో ట్వీట్ చేశారు.
హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. హరితహారం ద్వారా నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో కృషి చేశామన్నారు. హైదరాబాద్‌లో 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, మరెన్నో ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవేకాక మరెన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. డిసెంబరు 1న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలకాలని చెప్పారు.