ఆసీస్ తో తొలి వన్డే.... ఆశలు రేకెత్తిస్తున్న ధావన్, పాండ్య ద్వయం

  • చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం
  • సిడ్నీలో నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
  • భారీ స్కోరు సాధించిన కంగారూలు
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా క్రికెట్ బరిలో దిగింది. ఆస్ట్రేలియాతో ఇవాళ సిడ్నీ మైదానం వేదికగా తొలి వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఫించ్ (114), స్టీవెన్ స్మిత్ (105) సెంచరీలు సాధించగా, వార్నర్ (69) రాణించాడు. ఐపీఎల్ లో తుస్సుమనిపించిన మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ పోరులో చిచ్చరపిడుగులా ఆడి 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కాయి.

ఇక లక్ష్యఛేదనలో టీమిండియా 26 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. భారత్ గెలవాలంటే 24 ఓవర్లలో 193 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లున్నాయి. బరిలో శిఖర్ ధావన్, హార్డిక్ పాండ్యా ఉన్నారు. ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకుని నిలకడగా ఆడుతున్నారు.


More Telugu News