శశికళ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
- అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ
- బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్నమ్మ
- జనవరిలో విడుదల అవుతారంటూ కొన్నిరోజులుగా ప్రచారం
- ప్రచారానికి తెరదించిన కర్ణాటక హైకోర్టు
- శశికళ శిబిరంలో నిరుత్సాహం
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. త్వరలోనే చిన్నమ్మ విడుదల కానుందన్న ప్రచారానికి తెరదించుతూ కర్ణాటక హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
'పురచ్చితలైవి' జయలలితకు సన్నిహితురాలిగా పేరుగాంచిన శశికళ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఇటీవలే తన శిక్ష కాలాన్ని తగ్గించాలని శశికళ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. జరిమానా తాలూకు రూ.10 కోట్లను ఆమె చెల్లించారని, దాంతో జనవరిలో ఆమె విడుదల కావొచ్చని ప్రచారం జరిగింది. శశికళ వర్గంలోనూ కొన్నిరోజులుగా ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక హైకోర్టు నిర్ణయంతో ఈ ప్రచారానికి తెరపడడంతో, చిన్నమ్మ వర్గంలో నిరుత్సాహం నెలకొంది.