డాబర్, మారికో మధ్య 'హనీ' వార్!
- మారికో తప్పుడు ప్రచారం చేస్తోందని డాబర్ ఫిర్యాదు
- ఏఎస్సీఐని ఆశ్రయించిన డాబర్
- అదే తరహా ఆరోపణలు చేసిన మారికో
- అన్ని హనీ బ్రాండ్లు కల్తీవేనన్న సీఎస్ఈ
ఇండియాలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు డాబర్, మారికో మధ్య కొత్త యుద్ధం ప్రారంభమైంది. ఈ రెండు బ్రాండ్లూ ఇండియాలో తేనెను మార్కెటింగ్ చేస్తున్నాయి. హనీ బ్రాండ్ విషయంలో డాబర్ మోసం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మారికో.. కాదు... మారికోయే తప్పుదారి పట్టిస్తోందని డాబర్ ఒకదానిపై మరొకటి ఆరోపించుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఏఎస్సీఐ (అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వరకూ వెళ్లింది.
ఆదివారం నాడు మారికో అందిస్తున్న సఫోలా బ్రాండ్ ఎన్ఎంఆర్ (న్యూక్లియర్ మాగ్నటిక్ రిసోనెన్స్) పరీక్షల్లో విఫలం అయిందని ఆరోపిస్తూ, డాబర్ ఫిర్యాదు చేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయినా, సఫోలా హనీపై తప్పుడు ప్రచారం చేసుకుంటోందని డాబర్ ఆరోపించింది. సఫోలా హనీలో సుగర్ సిరప్ ను కలుపుతున్నారని టెస్ట్ రిపోర్ట్ లో వెల్లడైందని డాబర్ ఆరోపించింది.
ఇక ఇదే సమయంలో మారికో సైతం డాబర్ పై ఆరోపణలు గుప్పించింది. తమ తేనె ఉత్పత్తులు ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్ని క్వాలిటీ పారామీటర్లను పాటిస్తున్నదని చెబుతూ, ఏఎస్సీఐ కోడ్ 1.4 ప్రకారం, డాబర్ హనీ విషయంలో తప్పుడు క్లయిమ్ లను చేస్తున్నారని మారికో ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెల 3న ఈ విషయంలో ఏఎస్సీఐకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. తమ ఫిర్యాదును వారు స్వీకరించారని తెలిపారు.
కాగా, ఇప్పటివరకూ తమకు హనీ బ్రాండ్లపై నాలుగు ఫిర్యాదులు అందాయని స్పష్టం చేసిన ఏఎస్సీఐ, వాటి పేర్లను మాత్రం వెల్లడించ లేదు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని, విచారణ తరువాత చర్యలు తీసుకుంటామని ఏఎస్సీఐ సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలను వెనక్కు తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు.
గతవారంలో పర్యావరణ నిఘా సంస్థ సీఎస్ఈ ఓ అధ్యయనాన్ని వెలువరిస్తూ, డాబర్ సహా ఎన్నో తేనె బ్రాండ్లలో పంచదారను కలుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండూ, హిట్కారీ, ఏపిస్, హిమాలయా తదితర సంస్థల హనీ బ్రాండ్లు ఎన్ఎంఆర్ పరీక్షల్లో విఫలమయ్యాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు సీఎస్ఈ పేర్కొంది. ఇండియాలో హనీ బ్రాండ్ల మార్కెట్ రూ.1,729 కోట్లను దాటి, సాలీనా 10 శాతం వృద్ధితో వెళుతుండగా, అధిక మార్కెట్ వాటాను పొందేందుకు పోటీ పడుతున్న కంపెనీలు, ఇలా ఒకరి పరువును మరొకరు దిగజార్చుకునేలా ప్రవర్తిస్తుండటాన్ని మార్కెట్ నిపుణులు తప్పుపడుతున్నారు.