తిరుమల ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
- తిరుమలలో భారీ వర్షాలు
- రహదారిపై పడిన బండరాళ్లు
- నిలిచిపోయిన వాహనాలు
- తీవ్రంగా శ్రమించి బండరాళ్లను తొలగించిన టీటీడీ సిబ్బంది
తిరుమలలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఘాట్ రోడ్డుపై ఈ ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనాల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది భారీ బండరాళ్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. రాళ్ల తొలగింపు అనంతరం వాహనాలకు అనుమతి ఇచ్చారు.
కాగా, తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటీవల నివర్ తుపాను సందర్భంగా తిరుమలలో కుండపోత వానలు కురిశాయి. మాఢవీధుల్లో సైతం వరదలు వచ్చాయి. స్వామివారి పుష్కరిణి నిండిపోయింది. గోగర్భం, ఆకాశగంగ డ్యాములు జలకళతో పరవళ్లు తొక్కుతున్నాయి.