కొత్త సీఈవో నాయకత్వంలో దూసుకుపోతున్న విప్రో

  • ఐదు నెలల క్రితం సీఈవోగా బాధ్యతలను చేపట్టిన డెలాపోర్ట్
  • 70 శాతం పెరిగిన విప్రో షేరు
  • క్లయింట్లతో 130కి పైగా కాంట్రాక్టులను సాధించిన డెలాపోర్ట్
విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. కంపెనీ సీఈవోగా బాధ్యతలను చేపట్టిన ఐదు నెలల్లోనే సంస్థను ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన ఫ్రాన్స్ కు చెందిన క్యాప్ జెమినీ సీనియర్ ఎగ్జెక్యూటివ్ గా ఉన్నారు. సీఈవోగా డెలాపోర్ట్ బాధ్యతలను చేపట్టిన తర్వాత విప్రో షేరు ఏకంగా 70 శాతం పెరిగింది.

కరోనా సమయంలో కూడా డెలాపోర్ట్ కంపెనీ కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. వర్చువల్ మీటింగుల ద్వారా మేనేజర్లు, సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. సంస్థలో లీడర్ షిప్ పొజిషన్ల సంఖ్యను 25 నుంచి 4కు తగ్గించారు. క్లయింట్లతో దాదాపు 130కి పైగా సమావేశాలను నిర్వహించడం ద్వారా యూఎస్, యూరప్ నుంచి మల్టీ ఇయర్ కాంట్రాక్టులను సాధించారు.

ఈ సందర్భంగా డెలాపోర్ట్ మాట్లాడుతూ, ఇప్పుడిప్పుడే ఐటీ ఇండస్ట్రీలో కదలిక వచ్చిందని... విప్రోను తాను మళ్లీ గత వైభవం దిశగా తీసుకెళ్తానని చెప్పారు. అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయని తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... కంపెనీ సీఈవోగా బాధ్యతలను చేపట్టినప్పటికీ... కరోనా కారణంగా ఆయన ఇంత వరకు ఇండియాలోని కార్యాలయానికి రాలేదు.


More Telugu News