అలాగైతే వైసీపీ, టీఆర్ఎస్‌ ప్రభుత్వాలు వెంటనే ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: ఐవైఆర్

  • భారత్ బంద్ కు టీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ మద్దతు 
  • ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా అమలులో ఆయిల్ ఫామ్ చెరకు చట్టాలు
  • ఒప్పంద వ్యవసాయ చట్టాలు కూడా
  • కేంద్ర వ్యవసాయ చట్టాలకు ఇవే స్ఫూర్తి  
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న భారత్ బంద్‌లో దేశ వ్యాప్తంగా రైతులు, పలు పార్టీల నేతలు, వ్యాపారులు పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఈ బంద్‌కు మద్దతు ఇస్తున్నామంటూ తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ చేసిన ప్రకటనలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

‘భారత్ బంద్ కు టీఆర్ఎస్ వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించాయి. దీని అర్థం ఈ పార్టీలు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయా?  ఈ రాష్ట్రాలలో దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆయిల్ ఫామ్ చెరకు చట్టాలు ఒప్పంద వ్యవసాయ చట్టాలు. అలాగైతే వెంటనే వీటిని రద్దు చేయాలి. కేంద్ర వ్యవసాయ చట్టాలకు ఇవే స్ఫూర్తి’ అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.


More Telugu News