లీకు వీరులు చెప్పినట్టుగానే... మోనాల్ ను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్!
- ఆఖరి వారంలోకి ప్రవేశించిన బిగ్ బాస్
- హౌస్ లో ఐదుగురు ఫైనలిస్టులు
- నవ్వుతూ బయటకు వచ్చేసిన మోనాల్
టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలోకి వచ్చేసింది. ఆఖరి వారంలో హౌస్ లో నిలిచే ఐదుగురు ఫైనలిస్టులు ఎవరో తేలిపోగా, వీరిలో నుంచే ఒకరు విజేతగా నిలిచి, రూ. 50 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకోనున్నారు. ఇక, నాలుగో సీజన్ చివరి వారంలోకి ప్రవేశించే ముందు నిన్న రాత్రి ఆఖరి ఎలిమినేషన్ పూర్తయింది. లీకు వీరులు ముందుగానే చెప్పినట్టుగా మోనాల్ బయటకు వచ్చేసింది.
మోనాల్ తో పాటు దేత్తడి అరియానాను నిలబెట్టిన నాగార్జున, అరియానా సేవ్ అయిందని ప్రకటించి, మోనాల్ ను బయటకు వచ్చేయమన్నారు. ఆపై ఎప్పుడూ ఏడుస్తూ ఉండే మోనాల్, నవ్వుతూ అందరికీ వీడ్కోలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు పువ్విచ్చిన అఖిల్ కు మాత్రం కాస్తంత బరువైన హృదయంతో బై చెప్పింది. బయటకు వచ్చిన తరువాత హౌస్ లో మోనాల్ ప్రయాణంపై నాగ్ మాట్లాడారు.
ఈ సీజన్ పూర్తయిన తరువాత తాను గుజరాత్ కు వచ్చి కలుస్తానని అభిజిత్ ఆమెకు మాటిచ్చాడు. ఆపై అఖిల్ ను ఓ పాట పాడమని అడిగితే, "ఉండి పోరాదే... గుండె నీదేలే..." అంటూ పాడగా, టీవీలో దాన్ని చూసిన మోనాల్ కు మాత్రం కన్నీరు జలజలా కారింది. ఇక ఎలిమినేషన్ రౌండ్ ముగియగానే, మిగిలిన ఐదుగురూ పార్టీ చేసుకున్నారు. ఈ ఆదివారంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగియనుంది.