దూసుకుపోయిన మార్కెట్లు.. రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్
- 403 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 115 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3 శాతానికి పైగా పెరిగిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. భారతి ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, టైటాన్, ఏసియన్ పెయింట్స్ వంటి బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 46,666 పాయింట్లకు ఎగబాకింది. నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 13,683కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.11%), ఓఎన్జీసీ (2.69%), భారతి ఎయిర్ టెల్ (2.35%), ఏసియన్ పెయింట్స్ (2.17%), టైటాన్ కంపెనీ (2.14%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.94%), ఎన్టీపీసీ (-0.90%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), టెక్ మహీంద్రా (-0.59%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.51%).