సంక్రాంతి వరకూ తిరుమలలో సుప్రభాత సేవ రద్దు!

  • మొదలైన మార్గశిర మాసం
  • నేటి నుంచి తిరుప్పావై ప్రవచనాలు
  • 25న లక్ష వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు
గురువారం నుంచి జనవరి 14 వరకూ తిరుమల ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. మార్గశిర మాసం మొదలు కావడంతో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ప్రవచనాలను వేద పండితులు చదువుతారని అధికారులు తెలిపారు. ఈ నెలలోనే 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుందని, ఈ సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచి వుంచనున్నామని తెలిపారు.

భక్తులకు అసౌకర్యం కలుగరాదన్న ఆలోచనతో ఆగమ శాస్త్ర నిపుణులను సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 25వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి లక్ష టికెట్లను విడుదల చేయనున్నామన్నారు.


More Telugu News