తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు ఇవిగో!

  • టాలీవుడ్ పై కరోనా ప్రభావం
  • బాగా దెబ్బతిన్న సినీ రంగం
  • ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్న నిర్మాతల మండలి
  • సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఉపశమనం
  • డిసెంబరులో రిలీజయ్యే సినిమాలకు వీపీఎఫ్ చార్జీలు ఉండవని వెల్లడి
కరోనా సంక్షోభం నుంచి చిత్ర పరిశ్రమను, థియేటర్ల యాజమాన్యాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఊరట చర్యలకు ఉపక్రమించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబరులో రిలీజ్ అయ్యే సినిమాలకు వీపీఎఫ్ చార్జీలు ఉండవని వెల్లడించింది. వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు డిజిటల్ చార్జీల్లో 40 శాతం నిర్మాతలే చెల్లించాలని చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. డిజిటల్ సర్వీస్ చార్జీల సన్ సెట్ క్లాజ్ నిబంధనపై మార్చి 31 లోగా ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News