లడఖ్‌లో కలకలం రేపిన చైనా వాహనాలు

  • భారత సరిహద్దు దాటి లడఖ్‌లో ప్రవేశించిన చైనా వాహనాలు
  • అడ్డుకుని వాగ్వివాదానికి దిగిన స్థానికులు
  • భారత ఆర్మీ నుంచి లేని ప్రకటన
తమ దేశీయులను మోసుకొస్తున్న రెండు చైనా వాహనాలు లేహ్ జిల్లాలోని చాంగ్‌తాంగ్ ప్రాంతంలోని న్యోమా బ్లాక్‌లో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది కచ్చితంగా తెలియకపోయినా తాజాగానే జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయింది. చైనా వాహనాలను గుర్తించిన స్థానికులు వాగ్వివాదానికి దిగడంతో వారు వెనుదిరిగినట్టు వీడియోలో కనిపిస్తోంది.

అయితే, ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన లేదు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యోమా కౌన్సిలర్ ఇషే స్పల్‌జాంగ్ మాట్లాడుతూ, నాలుగైదు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.


More Telugu News