కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ప్రక్షాళన.. తెలంగాణకు నేడో, రేపో కొత్త చీఫ్!
- నాలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త చీఫ్‌లు
- 160 మంది నేతల అభిప్రాయాలతో మాణికం ఠాగూర్ నివేదిక
- అసోం, కేరళకు ఇప్పటికే ఇన్‌చార్జ్‌ల నియామకం
రాష్ట్రం ఏదైనా ఓటమిని అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తోపాటు తెలంగాణకు కొత్త చీఫ్‌లను నియమించాలని అధిష్ఠానం నిర్ణయించింది. స్థానిక నాయకుల అభిప్రాయ సేకరణ అనంతరం ఈ నియామకాలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అసోం, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తారిక్ అన్వర్, జితేంద్రసింగ్‌లను ఇప్పటికే ఇన్‌చార్జ్‌లుగా నియమించగా, వారికి సహాయకులుగా ముగ్గురు కార్యదర్శులను కూడా అధిష్ఠానం నియమించింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం కోసం రంగంలోకి దిగిన ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ 160 మంది నేతల అభిప్రాయాలతో అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే తెలంగాణకు కొత్త చీఫ్ ప్రకటన రావచ్చని తెలుస్తోంది.