నిన్నటి భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్న మార్కెట్లు

  • 453 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 138 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన హెచ్సీఎల్ షేర్
యూకేలో కొత్త కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే రోజు వ్యవధిలోనే మార్కెట్లు భారీగా కోలుకున్నాయి. ఈరోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ... చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి.

కొత్త వైరస్ ను కట్టడి చేసేందుకు యూకేలో లాక్ డౌన్ విధించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు లాభపడి 46,007కి చేరుకుంది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 13,466 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (5.09%), టెక్ మహీంద్రా (4.33%), ఇన్ఫోసిస్ (3.78%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.67%), సన్ ఫార్మా (2.64%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.94%), బజాజ్ ఫైనాన్స్ (-0.56%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.13%).


More Telugu News