195 పరుగులకే ఆసీస్ ఆలౌట్.. బ్యాటింగ్ ప్రారంభించగానే టీమిండియా ఓపెనర్ మయాంక్ డకౌట్
- ఆస్ట్రేలియా-భారత్ మధ్య రెండో టెస్టు
- మార్నస్ లబుషేన్ 48, ట్రావిస్ హెడ్ 38 పరుగులు
- బుమ్రాకి 4, రవీచంద్రన్ అశ్విన్ కి 3 వికెట్లు
- ముగిసిన తొలిరోజు ఆట
ఆస్ట్రేలియా-భారత్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న రెండో టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఆతిథ్య జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. జో బర్న్స్ 0, మాథ్యూ వేడ్ 30, మార్నస్ లబుషేన్ 48, స్టీవెన్ స్మిత్ 0, ట్రావిస్ హెడ్ 38, కామెరాన్ గ్రీన్ 12, టిమ్ పైన్ 13, పాట్ కమ్మిన్స్ 9, మిచెల్ స్టార్క్ 7, నాథన్ లైయన్ 20, జోష్ హేజెల్ వుడ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
ఎక్స్ ట్రాల రూపంలో ఆసీస్‌కు 14 పరుగులు వచ్చాయి. దీంతో 72.3 ఓవర్ల వద్ద 195 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. బుమ్రా 4, రవీచంద్రన్ అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా 1 వికెట్టు తీశారు. ఇక ఆ వెంటనే టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ గా వెనుదిరిగాడు.
కాగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 1 వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్ మాన్ గిల్ 28, ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కు వికెట్ లభించింది.