తిరుమలలో మరోసారి ఆందోళనకు దిగిన భక్తులు

  • శ్రీవాణి ట్రస్టు ద్వారా తిరుమలకు భక్తులు
  • బంగారు వాకిలి నుంచే వెనక్కి పంపిన సిబ్బంది
  • మహిళా భక్తులనూ ఆలయ సిబ్బంది తోసేశారని ఆగ్రహం
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట శ్రీవారి భక్తులు నిరసనకు దిగిన ఘటనను మరవకముందే ఈ రోజు భక్తులు మరోసారి ఆందోళనకు దిగారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన తమను బంగారు వాకిలి నుంచే వెనక్కి పంపేస్తూ, ఆలయ సిబ్బంది తోసేశారని భక్తులు చెప్పారు. మహిళలపై కూడా ఇలాగే ప్రవర్తించారని తెలిపారు.

 వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో నిన్నటి నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కొవిడ్-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో మొదట తిరుపతిలోని స్థానికులకే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని ముందుగా టీటీడీ ప్రకటించింది. అయితే, క్యూలైన్లలో నిల్చున్న ఇతర ప్రాంతాల వారికి కూడా దర్శనానికి టికెట్లు ఇచ్చారు.


More Telugu News