అమరావతిలో 50 శాతం దళితులు ఉంటే సీఎం ఇలా మాట్లాడడం పద్ధతిగా లేదు: రఘురామకృష్ణరాజు
- అమరావతిని ఏక కుల ప్రాంతం అన్నారంటూ సీఎంపై విమర్శలు
- గట్టిగా స్పందించిన రఘురామకృష్ణరాజు
- సీఎంకు కనీస పరిజ్ఞానంలేదని వ్యాఖ్యలు
- గణాంకాలు తెలుసుకోవాలని హితవు
అమరావతిని ఏక కులం ప్రాంతం అని పేర్కొన్నారంటూ సీఎం జగన్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. అమరావతిలో 50 శాతానికి పైగా దళితులు ఉన్నారని, సీఎం జగన్ వ్యాఖ్యలు సమంజసంగా లేవని అన్నారు. సీఎం జగన్ గణాంకాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసి అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టొద్దని స్పష్టం చేశారు. సీఎం బాధ్యతారాహిత్యంతో చేసే వ్యాఖ్యలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. అమరావతిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కనీస పరిజ్ఞానం లేకుండా చేసినవని అర్థమవుతోందని అన్నారు.