కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబేకి కరోనా పాజిటివ్
- అశ్విని కుమార్ లో ప్రాథమిక లక్షణాలు
- అనుమానంతో టెస్టు చేయించుకున్న మంత్రి
- కరోనా నిర్ధారణ కావడంతో హోంఐసోలేషన్
- తనను కలిసిన వాళ్లు కూడా టెస్టులు చేయించుకోవాలని సూచన
కేంద్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. కాగా, తనకు కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నానని చౌబే ట్విట్టర్ లో వెల్లడించారు.
తనను ఇటీవల కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నానని, అన్ని కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నానని తెలిపారు.