జమ్మూకశ్మీర్‌లో త్వరలో వెంకటేశ్వరస్వామి ఆలయం: టీటీడీ
- ఢిల్లీలో గుడికో గోమాత కార్యక్రమం
- ముంబైలో ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు
- అయోధ్యలోనూ ఆలయ నిర్మాణానికి సుముఖత
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 500 ఆలయాలను నిర్మించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మత్స్యకార గ్రామాల్లోని కాలనీల్లో వీటిని నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని టీటీడీ ఆలయానికి గోవును ఆందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ తరపున దేశవ్యాప్తంగా ఆలయాలకు గోవులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు.
ముంబైలో ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశామని, అయోధ్యలో ఆలయం కానీ, లేదంటే కల్యాణ మంటపం, లేదంటే సత్రం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైవీ తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజధానిలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర కాలేజీని యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు సుబ్బారెడ్డి చెప్పారు.