తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్!

  • మరో వారంలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ
  • ఇప్పటికే అండర్ - 19 జట్టులో స్థానం
  • రాణిస్తే ముంబై ఇండియన్స్ కు ఎంపికయ్యే అవకాశాలు
మాస్టర్ బ్లాస్టర్ గా కోట్లాది మంది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్, తొలిసారిగా ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీ కోసం ఎంపికయ్యాడు.

ఎంసీఏ (ముంబై క్రికెట్ అసోసియేషన్) సమావేశమై, మొత్తం 22 మంది సభ్యులను తమ టీమ్ కోసం ఎంపిక చేయగా, ఇప్పటివరకూ ముంబై తరఫున అండర్ -14, అండర్ - 16, అండర్ - 19 తరఫున పాల్గొన్న అర్జున్ నూ ఎంపిక చేశారు.

ఇక ఈ టోర్నీలో అర్జున్ టెండూల్కర్ రాణిస్తే, తదుపరి ఐపీఎల్ సీజన్ కు ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నాయి. బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో సయ్యద్ ముస్తాక్ టోర్నీలో అర్జున్ ఆడనున్నాడు.


More Telugu News