రామతీర్థంలో రాళ్లు, వాటర్ ప్యాకెట్లతో నాపై దాడి చేశారు: విజయసాయిరెడ్డి
- నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు
- చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల ఆదేశాలతో దాడి
- నా గన్‌మన్‌కు గాయాలయ్యాయి
రామతీర్థం శ్రీరాముడి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేవాలయ సందర్శనకు వెళ్లిన తనపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, వాటర్ ప్యాకెట్లతో తనపై దాడి చేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల ఆదేశాల ప్రకారమే ఈ దాడి జరిగిందని చెప్పుకొచ్చారు.
ఆ దాడిలో తన గన్‌మన్‌కు గాయాలయ్యాయని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై ట్విట్టర్ ద్వారా కూడా ఆయన స్పందిస్తూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన అనుకూల మీడియా యజమానులను కలిసేందుకు వెళ్తే మాత్రం బూట్లు విప్పి వంగి వంగి వినయం ప్రదర్శిస్తారని చెప్పారు. పూజల్లో, ఆలయ ప్రాంగణాల్లో మాత్రం పాదరక్షలను విప్పేది లేదంటారని చెప్పారు. అటువంటి వారు భక్తి, మత విశ్వాసాల గురించి చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చెప్పారు.