రజనీకాంత్ ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లిన నమో నారాయణస్వామి!
- ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీ
- ఇంటికి వచ్చిన స్వామీజీకి సాదర స్వాగతం
- దాదాపు అరగంట పాటు భేటీ
హైదరాబాద్ లో అనారోగ్యం బారిన పడి కోలుకున్న తరువాత చెన్నై, పోయిస్ గార్డెన్ లోని ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి ఆధ్యాత్మికవేత్త నమో నారాయణస్వామి వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. తన ఇంటికి వచ్చిన నమో నారాయణ స్వామిని రజనీ, ఆయన భార్య లత స్వాగతం పలికి, ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆపై దాదాపు అరగంట పాటు వారు మాట్లాడుకున్నారు.
ఈ భేటీ అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ దంపతులు, ఆయనకు వీడ్కోలు పలికారు. అయితే, గత వారం రోజులుగా, తనను పరామర్శించేందుకు ఎవరినీ అనుమతించని రజనీ, నమో నారాయణ స్వామిని సాదరంగా ఆహ్వానించడం, అందుకు సంబంధించిన చిత్రాలు తమిళ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.