హైదరాబాద్‌లో వారం రోజుల్లో 3,571 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

  • మాదాపూర్ పరిధిలో అత్యధికంగా 714 కేసుల నమోదు
  • బాలాపూర్‌లో అత్యల్పంగా 173 కేసులు
  • డ్రంకెన్ డ్రైవ్  తనిఖీలను విస్తృతం చేశామన్న పోలీసులు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత నెల 27 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 3,571 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డిసెంబరు 31నే ఏకంగా 931 కేసులు నమోదైనట్టు చెప్పారు. మాదాపూర్‌లో అత్యధికంగా 714, గచ్చిబౌలిలో 709 కేసులు నమోదు కాగా, బాలాపూర్ పరిధిలో అత్యల్పంగా 173 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిని నివారించేందుకు తనిఖీలను విస్తృతం చేసినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News