సిట్, సీఐడీలతో అసలు దొంగలు దొరకరని ప్రభుత్వానికి కూడా తెలుసు: వర్ల రామయ్య
- విగ్రహాల ధ్వంసం ఘటనలపై సిట్ ఏర్పాటు
- సిట్ వేయడం వేస్ట్ అంటూ వర్ల వ్యాఖ్యలు
- వివేకా, అమరావతి వ్యవహారాలపై సిట్ లు ఏంతేల్చాయన్న వర్ల
- చంద్రబాబు క్రైసవమతాన్ని కించపర్చలేదని స్పష్టీకరణ
ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పెదవి విరిచారు. సిట్, సీఐడీ విచారణలతో అసలు దొంగలు దొరకరన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య కేసులోనూ సిట్ వేశారని, అమరావతి భూముల వ్యవహారంలోనూ సిట్ వేశారని వెల్లడించారు.
ఆ సిట్ లు ఏం తేల్చాయి గనుక... ఇప్పుడు ఆలయాలపై దాడుల ఘటనల్లో సిట్ వేయడం కూడా శుద్ధ దండగ అని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత క్రైస్తవమతంపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆయన క్రైస్తవమతాన్ని ఎప్పుడు కించపర్చలేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.