ఎన్నిసార్లు మారతారు బాబు గారూ?: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • ట్విట్టర్లో మరోమారు స్పందించిన విజయసాయి
  • ఇప్పటికీ ఓటమికి కారణాలు తెలియదంటున్నాడని వెల్లడి
  • పైగా క్షమాపణలు చెబుతున్నాడని వ్యాఖ్యలు
  • కొత్త డ్రామాలు అంటూ విమర్శలు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. సంక్రాంతి సృష్టికర్తను తానే అని చెప్పుకునే బాబు, చిత్తుగా ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంటున్నాడని ఎద్దేవా చేశారు.

పైగా క్షమాపణలు చెబుతూ పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేశారు.

మరో ట్వీట్ లో, సీఎం జగన్ నాయకత్వం వల్ల ఏపీలో క్షీర విప్లవానికి స్వాగతం పలకడంతో పాటు జాతి మొత్తానికి ఒక ఉదాహరణలా నిలిచిందని వెల్లడించారు. సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం కొన్నివేల మంది పాడి రైతులను పేదరికంపై విజయం సాధించేలా చేసి, శ్రమకు తగ్గ ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు.


More Telugu News