కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించనున్న జగన్

  • ఏపీలో తొలి విడతలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్
  • విజయవాడ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించనున్న జగన్
  • వ్యాక్సినేషన్ ను లైవ్ లో వీక్షించనున్న మోదీ
దేశ వ్యాప్తంగా రేపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఏపీలో కూడా వ్యాక్సిన్ ను అన్ని ప్రాంతాలకు తరలించారు. మరోవైపు  వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి జగన్ రానున్నారు. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన తర్వాత... తన కార్యాలయం నుంచి వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్ ను ఆయన పరిశీలిస్తారు. ఏపీలో తొలి విడతలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి రేపు వ్యాక్సిన్ వేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను లైవ్ లో వీక్షించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది.


More Telugu News