రామతీర్థం నీలాచలం ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం
- రామతీర్థంలో ఇటీవల విగ్రహ ధ్వంసం
- రాజకీయంగా తీవ్ర దుమారం
- సిట్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన సర్కారు
- విగ్రహ ధ్వంసం ఘటనాస్థలిని పరిశీలించిన సిట్ సభ్యులు
విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ కోదండరామస్వామి దేవాలయం పేరు గత కొన్నిరోజులుగా వార్తల్లో ప్రముఖంగా చోటుచేసుకుంటోంది. ఇటీవల అక్కడ రాముడి విగ్రహం తల నరికిన దుండగులు, ఆ తలను ఆలయ పుష్కరిణిలో పడేశారు. రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో డీఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని సిట్ బృందం రామతీర్థం క్షేత్రంలో పర్యటించింది. రాముడి విగ్రహ ధ్వంసం ఘటనాస్థలిని డీఐజీ అశోక్ కుమార్, ఇతర అధికారులు నిశితంగా పరిశీలించారు. ఇక్కడి నీలాచలం కొండపై కలియదిరిగిన అధికారులు, అనంతరం కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిపై జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశం చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రామతీర్థం ఘటనలో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే సెల్ టవర్ సిగ్నళ్ల ఆధారంగా ఘటన జరిగిన రోజు రాత్రి ఆలయ పరిసరాల్లో సంచరించిన వారిని సిట్ విచారించింది. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.