సంక్రాంతి ముగియడంతో తిరుమలలో పెరిగిన రద్దీ!

  • నిన్న 38 వేల మందికి పైగా దర్శనం
  • హుండీ ద్వారా రూ. 2.56 కోట్లు
  • తలనీలాలు సమర్పించిన 15,016 మంది
సంక్రాంతి సీజన్ ముగియడంతోనే తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తమ స్వగ్రామాల నుంచి నగరాలకు చేరుకునే క్రమంలో పలువురు స్వామి దర్శనానికి వచ్చారు. నిన్న ఆదివారం నాడు స్వామిని 38,079 మంది భక్తులు దర్శించుకున్నారని, 15,016 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.

హుండీ ద్వారా రూ. 2.56 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా రోజుకు 5 వేల వరకూ టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.


More Telugu News