ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష
- సెక్యూరిటీపై దాడి చేసిన కేసులో శిక్ష
- 2016లో జరిగిన ఘటన
- హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతి
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 2016లో ఎయిమ్స్ సెక్యూరిటీ స్టాఫ్ పై దాడి చేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఆయనకు బెయిల్ కూడా మంజూరయింది. హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతినిస్తూ బెయిల్ ఇచ్చింది. సోమనాథ్ భారతిపై ఉన్న అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని ఈ సందర్భంగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అన్నారు.
2016లో దాదాపు 300 మందితో పాటు కలిసి వచ్చిన సోమనాథ్ భారతి ఎయిమ్స్ వద్ద ఉన్న ఫెన్సింగ్ ను కూల్చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ స్టాఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు శిక్షను ఖరారు చేసింది.
2016లో దాదాపు 300 మందితో పాటు కలిసి వచ్చిన సోమనాథ్ భారతి ఎయిమ్స్ వద్ద ఉన్న ఫెన్సింగ్ ను కూల్చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ స్టాఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు శిక్షను ఖరారు చేసింది.