మార్కెట్లకు ఈ రోజూ లాభాలే.. తొలిసారి 50 వేల పాయింట్లకు పైన ముగిసిన సెన్సెక్స్

  • 458 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 142 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7.65 శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్
కేంద్ర బడ్జెట్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 50 వేల పాయింట్లకు ఎగువన ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 50,256కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 14,790 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.65%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.28%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.71%), సన్ ఫార్మా (3.29%), ఎన్టీపీసీ (3.13%).

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-0.90%), మారుతి సుజుకి (-0.89%), ఐటీసీ (-0.66%), కోటక్ మహీంద్రా (-0.63%), ఏసియన్ పెయింట్స్ (-0.42%).


More Telugu News