ఎట్టకేలకు 'రూట్' క్లియర్... నదీమ్ బౌలింగ్ లో అవుటైన ఇంగ్లండ్ సారథి
- చెన్నై టెస్టులో రూట్ డబుల్ సెంచరీ
- రూట్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న నదీమ్
- 500 మార్కు దాటిన ఇంగ్లండ్ స్కోరు
- ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఇషాంత్
- 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
చెన్నై టెస్టులో విశ్వరూపం ప్రదర్శించిన ఇంగ్లండ్ సారథి జో రూట్ (218) చిట్టచివరికి స్పిన్నర్ షాబాజ్ నదీమ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. భారత బౌలర్లను విసిగిస్తూ, అడ్డుగోడలా నిలిచిన రూట్ ను లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ ఓ చక్కని బంతితో పెవిలియన్ చేర్చాడు. తిరుగులేని ఫామ్ లో ఉన్న రూట్ ను తొలగించి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, అప్పటికే ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రూట్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్లకు 477 పరుగులు.
ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (30) కూడా ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు 500 మార్కు దాటింది. ప్రస్తతం ఇంగ్లండ్ స్కోరు 8 వికెట్లకు 525 పరుగులు. అంతకుముందు బెన్ స్టోక్స్ 82, ఓల్లీ పోప్ 34 పరుగులు చేశారు. కాగా, ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. బట్లర్, ఆర్చర్ లను పెవిలియన్ చేర్చాడు.