క్రిప్టో కరెన్సీ విలువ పైపైకి... రూ.90 లక్షల కోట్లకు చేరిన వైనం!
- శనివారం నాటికి 1.24 ట్రిలియన్ డాలర్లుగా క్రిప్టో కరెన్సీ విలువ
- నెల రోజుల వ్యవధిలోనే 200 బిలియన్ డాలర్ల వృద్ధి
- క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ దే అత్యధిక వాటా
- రూ.29 లక్షలకు చేరిన ఒక బిట్ కాయిన్ విలువ
కరెన్సీ నోట్లను మనం కంటితో చూస్తాం. కానీ క్రిప్టో కరెన్సీ కంటికి కనిపించదు. కేవలం వర్చువల్ గా కొనసాగుతుందంతే. బిట్ కాయిన్లు కూడా ఈ కోవలోకే వస్తాయి. పైగా ఇది ఒక వ్యవస్థ నియంత్రణలో కూడా ఉండదు. అయితేనేం, గత కొంతకాలంగా క్రిప్టో కరెన్సీ విలువ పైపైకి దూసుకుపోతోంది. ఫిబ్రవరి 6 నాటికి ప్రపంచ క్రిప్టో కరెన్సీ విలువ రూ.90 లక్షల కోట్లకు చేరిందంటే దీని స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ట్రిలియన్ డాలర్ల మార్కు చేరుకున్న క్రిప్టో కరెన్సీ, నెల రోజుల్లోనే 200 బిలియన్ డాలర్ల మేర వృద్ధిని నమోదు చేసుకుంది.
ఇక, క్రిప్టో కరెన్సీలో రారాజు అంటే బిట్ కాయిన్ అనే చెప్పాలి. మొత్తం క్రిప్టో కరెన్సీలో దీనివాటానే అధికం. బిట్ కాయిన్ మార్కెట్ ఇప్పుడు రూ.53 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ రూ.29.11 లక్షల వద్ద చెలామణీలో ఉంది. బిట్ కాయిన్ తర్వాత రూ.13 లక్షల కోట్లతో ఎథేరియమ్ రెండో స్థానంలో ఉంది. ఇటీవల డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ కూడా క్రమంగా ఊపందుకుంటోంది.