ఉత్తరాఖండ్ విలయానికి అసలు కారణంపై నిగ్గుతేల్చనున్న ఇస్రో, డీఆర్డీఓ

  • విరిగిపడిన మంచు చరియలు
  • ధౌలిగంగా నదికి వరదలు
  • 200 మంది వరకు గల్లంతయ్యారన్న సీఎం
  • డీఆర్డీఓ, ఇస్రో నివేదికలతో ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ధౌలిగంగా నదికి హఠాత్తుగా వచ్చిన వరదల్లో 200 మంది వరకు గల్లంతయ్యారని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. అయితే, ఈ విలయానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలుసుకునేందుకు డీఆర్డీఓ బృందం ఇప్పటికే రంగంలో దిగిందని, ఈ విషయంలో తాము ఇస్రో సాయం కూడా తీసుకోదలిచామని వెల్లడించారు.

ఓ పెద్ద మంచుచరియ విరిగి పడిన కారణంగానే ఈ ఉత్పాతం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారని, అయితే ఘటనకు గల అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలని సీఎస్ ను ఆదేశించినట్టు సీఎం రావత్ తెలిపారు. డీఆర్డీఓ, ఇస్రో నుంచి సమగ్ర నివేదికలు వచ్చాక, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు ఏంచేయాలన్న దానిపై పక్కా ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.


More Telugu News