మా పార్టీ దగ్గర డబ్బులు లేవు.. ఉపఎన్నికల్లో పోటీ చేయలేం: దేవెగౌడ
- మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు
- మా అభ్యర్థులను పోటీకి దించడం లేదు
- 2023 నాటికి పార్టీని బలోపేతం చేస్తాం
కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు. ఈ ఉపఎన్నికలలో తాము పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. తమ పార్టీ దగ్గర డబ్బు లేదని, అందుకే తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించలేకపోతున్నామని చెప్పారు.
అయితే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కింది స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తామని అన్నారు. 2023 నాటికి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బసవకల్యాణ్, మస్కీ, సిందగీ అసెంబ్లీ నియోజకవర్గాలు, బెల్గాం లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి.