మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం ఆర్డినెన్స్ పై రిట్ పిటిషన్లు... విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు
- పలు గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపేలా ఆర్డినెన్స్
- నూతన పట్టణ ప్రాంతాల ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీ
- ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్లు
- విలీన గ్రామాల్లోనూ ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు
- తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా
రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా, పట్టణ ప్రాంతాలుగా మార్చుతూ ఏపీ సర్కారు ఇటీవల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం అనేక గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. అయితే ఆ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో 22 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. విలీన ప్రక్రియ నిలిపివేసి ఆ గ్రామాల్లో ఎన్నికలు జరపాలని పిటిషనర్లు కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం....మంగళగిరి, తాడేపల్లి, భీమవరం, తణుకు, బాపట్ల, పొన్నూరు, కందుకూరు, పాలకొల్లు మున్సిపాలిటీల్లోకి సమీప గ్రామాలను విలీనం చేశారు. విజయవాడ గ్రామీణం పరిధిలోని తాడిగడప, పోరంకి, యనమల కుదురు, కానూరు తదితర ప్రాంతాలతో వైఎస్సార్ తాడిగడప అర్బన్ ఏరియాను ఏర్పాటు చేశారు.