ఏపీ సీఎం జగన్‌పై ఈడీ కేసుల విచారణను 22కు వాయిదా వేసిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

  • సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు విజయసాయిరెడ్డి
  • ఆయన తరపు న్యాయవాది అభ్యర్థనతో కేసు విచారణ వాయిదా
  • సీబీఐ కేసులపై కొనసాగిన విచారణ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశామని, కాబట్టి ఈడీ కేసులపై విచారణను పది రోజులపాటు వాయిదా వేయాలని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అనుమతించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు కేసు విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

అలాగే, హెటిరో, అరబిందో వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో సహ నిందితుడిని అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలుకు ఈడీ గడువు కోరడంతో విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు. అయితే, సీబీఐ కేసులైన రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌లపై వాదనలు కొనసాగాయి.


More Telugu News